నిమ్మచెట్టు గ్రామంలో కొట్టుకుపోయిన పంట కాలువ రైతుల ఆవేదన

రిపోర్టర్: Alfa News Desk స్థలం: జి.కె.వీధి

జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ నిమ్మచెట్టు గ్రామంలో 2024 విపత్తులో దెబ్బతిన్న పంట కాలువను గ్రామస్థులు శ్రమదానంతో మట్టితో నిర్మించుకున్నారు. అయితే తాజా వర్షాలకు ఆ కాలువ మళ్లీ కొట్టుకుపోవడంతో 50 కుటుంబాల సాగుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి శాశ్వత ప్రాతిపదికన పంట కాలువను నిర్మించి, తమ సాగునీటి కష్టాలను తీర్చాలని రైతులు వేడుకుంటున్నారు.