మహిళల ఆసియా కప్ విజయంపై ప్రధాని మోదీ అభినందనలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: India

మహిళల ఆసియా కప్ టోర్నమెంట్‌లో అద్భుత విజయం సాధించి ఎనిమిదోసారి టైటిల్ కైవసం చేసుకున్న భారత మహిళల క్రికెట్ జట్టును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడం భారత క్రికెట్‌కు గర్వకారణమని మోదీ కొనియాడారు. క్రీడాకారిణుల ఆత్మవిశ్వాసం, నిలకడ యువతకు స్ఫూర్తిదాయకమని ఆయన ప్రశంసించారు.