ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపుపై కేటీఆర్ తీవ్ర నిలదీత

రిపోర్టర్: కిరణ్ స్థలం: తెలంగాణ

కర్ణాటక ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఆల్మట్టి డ్యామ్ ఎత్తును మరో అయిదు మీటర్లు పెంచుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు నిలదీయడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్, ఆల్మట్టి పెంపు వల్ల పాలమూరు, జూరాల, శ్రీశైలం, కృష్ణా పరివాహక ప్రాంతాలకు నీళ్లు ఎలా వస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై మాత్రం కాంగ్రెస్ పార్టీ కాకిగోల చేస్తోందని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.