ప్రాణాలను హరిస్తున్న ఎర్తింగ్ వైర్లు: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై కాలనీవాసుల ఆందోళన

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొన్కల్ గ్రామపంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన ఎర్తింగ్ వైర్లు స్థానికులకు తీవ్ర ప్రమాదకరంగా మారాయి. రాంనగర్, వినాయక నగర్, మేదర్ వాడ, గాంధీనగర్ కాలనీలలో ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎర్తింగ్ వైర్లను ప్రమాదకరంగా వదిలివేయడంతో ఎప్పుడేం జరుగుతుందోనని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రక్షణ కంచె లేకపోవడంతో నిత్యం భయాందోళనల మధ్యే జీవనం సాగిస్తున్నామని వారు వాపోయారు.