నెల్లూరు మేయర్ పీఠం కోసం ఆశావహుల తీవ్ర ప్రయత్నాలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: నెల్లూరు
నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో మేయర్ పీఠం దక్కించుకునేందుకు అధికార కూటమి పార్టీల ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మేయర్ స్థానాన్ని ప్రత్యక్ష విధానంలో ఎన్నుకోనుండటంతో తెదేపా, జనసేన, భాజపా నేతలు మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. రిజర్వేషన్లు ఇంకా ఖరారు కానప్పటికీ, సీనియర్లు, జూనియర్ల మధ్య పోటీ నెలకొంది.