భారీ ఊరట: గిఫ్ట్ ఐఎఫ్ఎస్సీలో డిబెంచర్లు, ప్రిఫరెన్స్ షేర్ల లిస్టింగ్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: న్యూఢిల్లీ
భారతీయ కంపెనీల నిధుల సమీకరణ ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇకపై గిఫ్ట్ ఐఎఫ్ఎస్సీలోని అంతర్జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీల్ లో ఈక్విటీ షేర్లతో పాటు కన్వర్టబుల్ డిబెంచర్లు, ప్రిఫరెన్స్ షేర్లను కూడా లిస్ట్ చేసుకునేందుకు నిబంధనలను సడలించినట్లు అధికారులు తెలిపారు. కొన్ని ప్రత్యేక షరతులకు లోబడి లిస్ట్ కాని పబ్లిక్ కంపెనీలకు కూడా విదేశీ లిస్టింగ్ కు అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.