తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా పరిసమాప్తం
రిపోర్టర్: గోపి
స్థలం: తిరుమల
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. తొమ్మిదో రోజైన బుధవారం రాత్రి బంగారు తిరుచ్చి ఉత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. అంతకుముందు ఉదయం శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ కార్యక్రమంలో తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం.రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్యచౌదరి, పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.