నిరసన పేరుతో స్థలాలను ఎప్పటికీ ఆక్రమించలేరని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రిపోర్టర్: సునీల్ స్థలం: న్యూఢిల్లీ

నిరసన పేరుతో ఎవరూ కూడా ఒక ప్రదేశాన్ని నిరవధికంగా ఆక్రమించుకోలేరని సీజేఐ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఆందోళనలకు నిర్దిష్టమైన సమయ పరిమితి ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్ కు ఉంటుందని, అయితే ఇతరుల హక్కులను కూడా విస్మరించరాదని కోర్టు పేర్కొంది. నిరసనల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని న్యాయస్థానం తేల్చిచెప్పింది.