చెన్నైలో మైనర్ బాలిక అత్యాచారం కేసులో మరో నిందితుడు అరెస్ట్
రిపోర్టర్: వెంకట్
స్థలం: చెన్నై
చెన్నైలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో జెమ్ గ్రానైట్స్ అధిపతి వీరమణి సన్నిహితుడు గణేషన్ను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరమణికి సంబంధించిన అశ్లీల వీడియోలను మొబైల్ ఫోన్లో ఉంచుకుని పోలీసులకు సమాచారం అందించకపోవడంతో ఈ పోక్సో కేసులో అతడిని నాల్గవ నిందితుడిగా చేర్చినట్లు అధికారులు తెలిపారు.