సిరికొండ ఆదర్శ పాఠశాలలో క్రీడాకారుల ప్రతిభా పాటవాలతో హోరెత్తనున్న మైదానం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: సిరికొండ

నిజామాబాద్ రూరల్ సిరికొండ ఆదర్శ పాఠశాల ప్రాంగణంలో మండల స్థాయి క్రీడా పోటీలను గురువారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ గడ్డం రాజేష్ రెడ్డి వెల్లడించారు. ఈ క్రీడా వేడుకల్లో విద్యార్థులు అందరూ అత్యంత ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. స్థానిక యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ పోటీలు ఎంతగానో దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.