శంషాబాద్ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్ నందన అరెస్ట్

రిపోర్టర్: సతీష్ స్థలం: రంగారెడ్డి

లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీ వీసా స్కామ్‌కు పాల్పడిన ‘నందూస్ వరల్డ్’ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకురాలు రమా నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన ఈ జంటపై ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కేసు నమోదైంది. విదేశాల నుండి వస్తున్న క్రమంలో లుకౌట్ నోటీసుల ఆధారంగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.