యాదగిరిగుట్టలో వైభవంగా సాగిన శ్రీవారి దివ్య గిరిప్రదక్షిణ

రిపోర్టర్: P.srinu స్థలం: యాదాద్రి భువనగిరి

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ కొండ చుట్టూ శనివారం నాడు భక్తులు ఘనంగా గిరిప్రదక్షిణ నిర్వహించారు. స్థానికులు, భజన బృందాలు, అధికారులు హరినామ సంకీర్తనలతో స్వామివారిని దర్శించుకున్నారు. పెద్దగాని శ్రీనివాస్ గురుస్వామి, సత్తిరెడ్డి, సాయి, కిరణ్, కమల్ తదితరులు పాల్గొన్నారు.