రామ్లీలా మైదాన్ ర్యాలీ ప్రభావం: పదకొండ వేల కోట్ల వ్యాపారం కోల్పోయామన్న వర్తకులు
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఢిల్లీ
రామ్లీలా మైదాన్ లో జరిగిన ఇండియా కూటమి ర్యాలీ కారణంగా నగరంలో పదకొండ వేల కోట్ల రూపాయల మేర వ్యాపార నష్టం వాటిల్లిందని చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఛైర్మన్ బ్రిజేష్ గోయల్ వెల్లడించారు. పండగ సీజన్ లో మార్కెట్లు మూతపడటంతో రిటైల్, టోకు వ్యాపారాలతో పాటు రవాణా, ఆతిథ్య రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, దీనివల్ల లక్షలాది మంది కార్మికులు, ఉపాధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.