చెన్నైలో సుప్రీంకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాలంటూ ప్రధానికి విజయ్ లేఖ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: చెన్నై
చెన్నైలో సుప్రీంకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ లేఖ రాశారు. దక్షిణ భారతదేశ ప్రజలకు న్యాయం సులభంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణలో ప్రాంతీయ అసమానతలను తొలగించాలని, దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఈ డిమాండ్ ను పునఃసమీక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.