అనంతపురం బీజేపీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా శివకుమార్ స్వామి నియామకం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: అనంతపురం రూరల్
అనంతపురం పట్టణ బీజేపీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా ప్రముఖ న్యాయవాది మహేశ్వరమ్మ గారి శివకుమార్ స్వామి నియమితులయ్యారు. జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు హాంపాపురం ఆదినారాయణ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. తన సేవలను గుర్తించి బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపిన శివకుమార్ స్వామి, పార్టీ అభివృద్ధికి మరియు న్యాయవాదుల సంక్షేమానికి శాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.