'అది మాయావతి ఇల్లే కాదు': ఢిల్లీ పింక్ హౌస్‌పై వైరల్ వార్తల ఖండన

రిపోర్టర్: రమేష్ స్థలం: ఢిల్లీ

ఢిల్లీలోని ఈస్ట్ పటేల్ నగర్‌లో ఉన్న పింక్ హౌస్ అనే విలాసవంతమైన భవనం ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి చెందినదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పష్టత వచ్చింది. భవన నిర్మాణం, ఏనుగుల శిల్పాలు ఉండటంతో ఇది మాయావతి ఇల్లేనని నెటిజన్లు పెద్ద ఎత్తున పోస్టులు చేశారు. అయితే ఆ ఇంటి గేటుపై విజయ్ కుమార్, అక్షయ్ కుమార్, సాక్షి కుమార్, రీతు కుమార్ వంటి ప్రైవేట్ వ్యక్తుల పేర్లు ఉండటంతోపాటు, ఇది వ్యాపారవేత్తలకు చెందిన భవనమని తేలింది.