కాలుష్య కోరల్ లో దక్షిణగంగ: తాగడానికి, స్నానాలకు పనికిరాని గోదావరి జలాలు

రిపోర్టర్: విజయ్ స్థలం: మంచిర్యాల

దక్షిణగంగగా భక్తుల పూజలు అందుకుంటున్న గోదావరి నది తీవ్ర కాలుష్య కోరల్ లో చిక్కుకుని తాగడానికి, పుణ్యస్నానాలకు పనికిరాకుండా మారుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. బాసర నుంచి చెన్నూరు వరకు నదీతీరంలో పుణ్యక్షేత్రాల వ్యర్థాలు, మురుగునీరు, పారిశ్రామిక విష పదార్థాలు కలవడంతో జలాలు పూర్తిగా కలుషితమయ్యాయి. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి జలాశయాల వద్ద నీరు నిల్వ ఉండటంతో కాలుష్య సమస్య మరింత తీవ్రమైందని, అధికారులు తక్షణమే ప్రక్షాళన చర్యలు చేపట్టాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.