బంగారం ప్రియులకు షాక్: వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన ధరలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

బంగారం కొనుగోలుదారులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వరుసగా రెండో రోజు గోల్డ్ రేట్లు పెరిగినట్లు మార్కెట్ నిపుణులు వెల్లడించారు. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 270, 22 క్యారెట్లపై రూ. 250 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్ లోని ప్రధాన నగరాల్ లో పది గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 1,39,640 వద్ద కొనసాగుతుండగా, వెండి కిలో రూ. 2,00,000 వద్ద స్థిరంగా కొనసాగుతోందని నిపుణులు తెలిపారు.