గుండెపోటు ముప్పుపై యువత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిక
రిపోర్టర్: నరేష్
స్థలం: తెలంగాణ
ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా యువతలో పెరుగుతున్న గుండెపోటు ముప్పుపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. నలభై ఏళ్ల లోపు వయసున్న నలుగురు పురుషుల్లో ఒకరు గుండెపోటు బారిన పడుతున్నారని ఇండియన్ హార్ట్ అసోసియేషన్ వెల్లడించింది. చిన్న వయసులోనే వస్తున్న గుండెపోటు హెచ్చరికలను విస్మరించరాదని, అనారోగ్యకరమైన జీవనశైలిని మార్చుకోవాలని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఛాతిలో నొప్పి, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.