మెటా సరికొత్త ఏఐ అసిస్టెంట్ 'మ్యూజ్' విడుదల
రిపోర్టర్: శివ
స్థలం: World
మెటా సంస్థ 'మ్యూజ్' పేరుతో సరికొత్త స్వయంప్రతిపత్తి కలిగిన ఆర్టిఫిషియల్ ఇంటೆలిజెన్స్ అసిస్టెంట్ ను లాంచ్ చేసింది. మార్క్ జుకర్‌బర్గ్ కలల ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ ఏఐ టూల్, వినియోగదారుల తరఫున ఈమెయిల్స్ పంపడం, ప్రయాణాలు బుక్ చేయడం వంటి పనులను 24 గంటలూ చేయగలదు. ప్రస్తుతానికి అమెరికా యూజర్లకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ వాట్సాప్ మరియు ప్రత్యేక యాప్ ద్వారా పనిచేస్తుంది. అయితే దీని భద్రతపై గోప్యతా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.