ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన వసతులు కల్పించాలని కలెక్టర్ ఆదేశం

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

ప్రభుత్వ విద్యాసంస్థలలో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. భీమిని మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి నూతనంగా నిర్మిస్తున్న అదనపు తరగతి గదులు, భోజన శాల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.