జల్సాల కోసం ఆటో బ్యాటరీలు చోరీ చేసిన నిందితుడు అరెస్టు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

జల్సాల ఖర్చుల కోసం ఇంటి ముందు నిలిపి ఉంచిన రెండు ఆటోల బ్యాటరీలను దొంగలించిన ఘటన జన్నారం మండలం పొనకల్లో చోటుచేసుకుంది. ఎల్కపల్లి నరేశ్, సంబరాజుల రాజశేఖర్లకు చెందిన ఆటోల బ్యాటరీలను ఈ నెల 16న రాత్రి అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్సై గుర్రం ఉదయ్కిరణ్ 24 గంటల్లోనే దర్యాప్తు చేపట్టి ధర్మారానికి చెందిన గడ్డి చంద్రశేఖర్ను అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.