అంటార్కిటికాలో భారీగా పెరిగిన మంచు నిల్వలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: World

అంటార్కిటికా ఖండంలో గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా భారీగా మంచు నిల్వలు పెరిగాయి. 2021-2023 మధ్య కాలంలో సుమారు 695 బిలియన్ టన్నుల మంచు అదనంగా చేరినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. తూర్పు అంటార్కిటికాలో కురిసిన భారీ ಹಿమపాతం వల్లే ఈ అసాధారణ మార్పు సంభవించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఇది తాత్కాలికమేనని స్పష్టం చేశారు.