విద్యుత్ కోసం నీటి విడుదల వద్దు: తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ హెచ్చరిక
రిపోర్టర్: శివ
స్థలం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
కృష్ణా ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గడంతో కేఆర్ఎంబీ కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని విడుదల చేయవద్దని, కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని ఇరు రాష్ట్రాలకు స్పష్టం చేసింది. పోతిరెడ్డిపాడు ద్వారా నీటి విడుదలను నియంత్రించాలని, అందుబాటులో ఉన్న ప్రతి చుక్కను పొదుపుగా వాడుతూ, నీటి వృథాను అరికట్టాలని బోర్డు గట్టిగా హెచ్చరించింది.