షాకింగ్ ఘటన: నివాసంలో తనపై జరిగిన దాడిని వెల్లడించిన సైఫ్ అలీ ఖాన్
రిపోర్టర్: రాము
స్థలం: Mumbai
తమ నివాసంలో జరిగిన భయానక దాడి ఘటన గురించి బాలీవుడ్ స్టార్ దంపతులు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ తాజాగా ఓ టాక్ షోలో కీలక విషయాలు వెల్లడించారు. చిన్న కుమారుడి గదిలోకి ప్రవేశించిన దుండగుడిని అడ్డుకునే ప్రయత్నంలో తాను కత్తిపోట్లకు గురైనట్లు సైఫ్ తెలిపారు. ఆ రాత్రి నైట్ టీ-షర్ట్ తో రోడ్డుపైకి పరుగులు తీసి సహాయం కోరానని, ఆ భయానక అనుభవం తనను తీవ్రంగా దిగ్భ్రాంతికి గురిచేసిందని కరీనా కపూర్ ఆవేదన వ్యక్తం చేశారు.