నిరుద్యోగులకు భారీ ఊరట: నవంబర్ ఏడుకి ఏఈఈ పరీక్ష రీషెడ్యూల్
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఏఈఈ పరీక్ష తేదీలో కీలక మార్పు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎస్ఎస్సీ జేఈ పరీక్షతో తేదీలు క్లాష్ కావడంతో అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు నవంబర్ ఆరో తేదీన జరగాల్సిన పరీక్షను ఏడో తేదీకి మారుస్తున్నట్లు స్పష్టం చేశారు. రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల ముప్పై లోపు తగిన ఆధారాలతో ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించాలని అధికారులు సూచించారు.