రామాయణ సినిమాలో రావణుడిగా నటించిన యాష్ పై కొడుకు కన్నీళ్లు
రిపోర్టర్: వెంకట్
స్థలం: Hyderabad
రామాయణ చిత్రంలో రావణుడిగా నటుడు యాష్ చేసిన పాత్రను చూసి ఆయన కుమారుడు యథార్వ్ కన్నీళ్లు పెట్టుకున్నట్లు నటి సాయిపల్లవి తెలిపారు. లాస్ ఏంజిల్స్ లో జరిగిన ప్రీమియర్ షోలో ఈ సినిమాను వీక్షించిన పిల్లలు, జటాయువును చంపే ఘట్టం చూసి తీవ్రంగా స్పందించినట్లు వారు వెల్లడించారు. పక్షిని చంపడం తనకు నచ్చలేదని యథార్వ్ చెప్పాడని సాయిపల్లవి పేర్కొన్నారు. రావణుడి పాత్ర పోషించడం తనకు ఎంతో సవాలుతో కూడుకున్నదమని యాష్ వివరించారు.