గంజాయి మత్తులో కన్నబిడ్డను చంపిన తండ్రిపై వైఎస్సార్సీపీ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: నరేష్ స్థలం: Alluri Sitharama Raju District

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో గంజాయి మత్తులో కన్నబిడ్డను తండ్రి హత్య చేసిన ఘటనపై వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గంజాయిని పూర్తిగా కట్టడి చేస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వ పాలనలో ఇప్పటికి ఇరవై ఏడు నెలలు గడుస్తున్నా ఎందుకు అరికట్టలేకపోతున్నారని ప్రభుత్వాన్ని వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. కుటుంబ సభ్యులు వంద రూపాయలు ఇవ్వలేదనే కోపంతో విచక్షణ కోల్పోయి ఐదు నెలల పసికగను కడతేర్చడం అత్యంత దారుణమని ఆ పార్టీ పేర్కొంది.