తమ్మిడిహట్టి బరాజ్ భేటీ తుస్సుమంది: నీటిరంగ నిపుణుడు శ్రీధర్రావు దేశ్పాండే తీవ్ర విచారం

రిపోర్టర్: శివ స్థలం: Hyderabad

తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణంపై ముంబైలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశం మొక్కుబడిగా సాగిందని, ఎలాంటి స్పష్టమైన నిర్ణయాలు లేకుండానే ఆ భేటీ ముగిసిందని నీటిరంగ నిపుణుడు శ్రీధర్రావు దేశ్పాండే విచారం వ్యక్తం చేశారు. మహారాష్ట్రకు ప్రతికూలంగా లేకపోతేనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తారనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన వార్ధా బరాజ్ ప్రాజెక్టును తక్షణమే చేపట్టాలని, తద్వారా ఈ నీటి వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన సూచించారు.