టాలీవుడ్లో దూసుకెళ్తున్న అనస్వర రాజన్కు రవితేజ సరసన మరో అవకాశం

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న మలయాళ నటి అనస్వర రాజన్ను మరో క్రేజీ ప్రాజెక్ట్ వరించినట్లు సమాచారం. మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త చిత్రంలో అనస్వర నటించనున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ హారర్ జానర్ చిత్రానికి సంబంధించి తాజాగా జరిగిన ఫొటోషూట్లో ఆమె పాల్గొన్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది.