ఉద్యోగుల సమస్యలపై రాజపేటలో పీఆర్టీయూటీఎస్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండల కేంద్రంలో సోమవారం పీఆర్టీయూటీఎస్ నూతన కార్యాలయం ఘనంగా ప్రారంభమైంది. జిల్లా అధ్యక్షులు గడసంతల మధుసూదన్, ప్రధాన కార్యదర్శి కంచరకుంట్ల వీరారెడ్డి, మండల విద్యాధికారి మనోజ్ కుమార్ తదితరుల చేతుల మీదుగా ఈ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, పీఆర్సీని యాభై ఒక శాతం ఇవ్వాలని నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.