తిరుమలలో వైభవంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం మరియు గజవాహన సేవ
రిపోర్టర్: హరి
స్థలం: Tirupati
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరో రోజు ఆదివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి స్వర్ణ రథోత్సవం కనులపండువగా సాగింది. మాడ వీధులలో వేల మంది భక్తులు ఉత్సాహంగా రథాన్ని లాగారు. అనంతరం రాత్రి గజవాహన సేవ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్యచౌదరి, ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీధర్ వర్మ, సీవీఎస్వో మురళీకృష్ణ, పెద్దజీయర్, చిన్నజీయర్, సినీనటుడు బాలకృష్ణ సతీమణి వసుంధర తదితరులు పాల్గొన్నారు.