యూపీ ఎన్నికల్లో ఒవైసీ పోటీ వల్ల బీజేపీకే లాభం అంటున్న ఇమ్రాన్ మసూద్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: New Delhi

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూటమి ప్రతిపాదించడంపై కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ తీవ్రంగా స్పందించారు. యూపీలో ఒవైసీ పోటీ చేయడం వల్ల ప్రత్యక్షంగా బీజేపీకే ప్రయోజనం చేకూరుతుందని ఆయన ఆరోపించారు. బీజేపీని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్‌కే ఉందని, రాహుల్ గాంధీ నాయకత్వంలోనే కమల దళాన్ని ఓడించగలమని మసూద్ స్పష్టం చేశారు.