'దేశవాళీ క్రికెట్లోకి బాబర్ ఆజమ్ రీఎంట్రీ': పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
రిపోర్టర్: రాము
స్థలం: Pakistan
ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో పేవల ప్రదర్శన తర్వాత పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్ మన్, మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ సుమారు ఐదేళ్ల విరామం తరువాత దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి పునరాగమనం చేయడానికి సిద్ధమయ్యాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమయ్యే ప్రెసిడెంట్స్ ట్రోఫీ గ్రేడ్-వన్ టోర్నమెంట్ లో ఆయిల్ అండ్ గ్యాస్ డెవలప్ మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఓజీడీసీఎల్) తరఫున బాబర్ ఆజమ్ బరిలోకి దిగనున్నారు. ఇంగ్లాండ్ చేతిలో 0-3 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ కావడంతో పీసీబీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.