భార్యకు దొరికిపోతాననే భయంతో కిడ్నాప్ డ్రామా ఆడిన వ్యాపారవేత్త
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Mumbai
పుణేకు చెందిన ఓ లాండ్రీ వ్యాపారవేత్త భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ ప్రయాణానికి యత్నించగా ఇమ్మిగ్రేషన్ తనిఖీల్లో పాస్పోర్ట్ సమస్య కారణంగా అది రద్దయింది. ఈ నిజం భార్యకు తెలిస్తే దొరికిపోతానని భయపడిన అతడు, మొబైల్ స్విచ్ఛాఫ్ చేసి కిడ్నాప్ డ్రామాకు తెరతీశాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేయగా, చివరకు నిజం బయటపడుతుందనే ఉద్దేశంతో సహార్ పోలీసుల ఎదుట వ్యాపారవేత్త లొంగిపోయాడు.