కూటమి పాలనలో పెరిగిన ధరలపై విరుచుకుపడ్డ వైఎస్సార్సీపీ నేత కాకాణి పూజిత

రిపోర్టర్: సాయి దివ్య స్థలం: వెంకటాచలం

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కంటేపల్లిలో స్థానిక సంస్థ ఎన్నికల ప్రచారాన్ని వైయస్సార్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత నిర్వహించారు. ఎంపీటీసీ అభ్యర్థి వెలుబోయిన అపర్ణ, జడ్పీటీసి అభ్యర్థి డక్కిలి రమణమ్మల విజయం కోరుతూ ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ తీరుపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడుతూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.