ఒక్క విద్యార్థి కోసం ఐదు కిలోమీటర్లు అడవిలో నడుస్తున్న టీచర్
రిపోర్టర్: శివ
స్థలం: మహారాష్ట్ర
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు జీవన్ మిథారి విద్యపై తన అంకితభావంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. పాఠశాలలో కేవలం ఒక్క విద్యార్థి మాత్రమే ఉన్నప్పటికీ, రోజూ దట్టమైన అడవిలో ఐదు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి ఆయన పాఠాలు చెబుతున్నారు. వన్యప్రాణుల సంచారం ఉన్న ఈ ప్రమాదకర మార్గంలో గత 13 ఏళ్లుగా ఆయన ఈ నిస్వార్థ సేవను కొనసాగిస్తూ నిజమైన గురువుగా నిలిచారు.