తెలంగాణ విమోచన దినోత్సవ ఘన నివాళులు అర్పించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
సెప్టెంబర్ 17వ తేదీని ప్రతిఏటా తెలంగాణ విమోచన దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటున్నట్లు భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తెలిపారు. ఈ చారిత్రాత్మక దినం సందర్భంగా, హైదరాబాద్ సంస్థాన విముక్తి కోసం ప్రాణాలర్పించిన మహానుభావులు మరియు పోరాట యోధులకు ఆయన ఘన నివాళులు అర్పించారు. భారత యూనియన్‌లో హైదరాబాద్‌ను అంతర్భాగం చేయడానికి నాటి స్వతంత్ర సమరయోధులు ఎన్నో బలిదానాలు చేశారని, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చేసిన చారిత్రక కృషి ఎంతో కీలకమని ఆయన కొనియాడారు.