అమెరికాలో ఘనంగా దసరా దీపావళి ధమాకా వేడుకల ఏర్పాట్లు పూర్తి
రిపోర్టర్: హరి
స్థలం: కాలిఫోర్నియా
అమెరికాలో ప్రవాస భారతీయుల సంస్కృతీసంప్రదాయాలను చాటిచెప్పేలా అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ ఆధ్వర్యంలో అక్టోబర్ 17వ తేదీన నిర్వహించనున్న దసరా దీపావళి ధమాకా వేడుకలకు సర్వం సిద్ధమైందని నిర్వాహకులు తెలిపారు. కాలిఫోర్నియాలోని ప్లెజంటన్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగే ఈ చారిత్రక వేడుకలకు ప్రముఖ ఎన్నారై తెలుగు పత్రిక తెలుగు టైమ్స్ అధికారిక మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తోందని నిర్వాహకులు స్పష్టం చేశారు.