అమెరికా నౌకలపై దాడులు చేయబోమన్న హూతీ తిరుగుబాటుదారులు

రిపోర్టర్: రాజేష్ స్థలం: World

సౌదీ అరేబియాపై దాడులు కొనసాగిస్తున్న హూతీ తిరుగుబాటుదారులు ఎర్రసముద్రంలో అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకోబోమని కీలక ప్రకటన చేశారు. ఈ విషయంలో అగ్రరాజ్యంతో చర్చలు జరిపినట్లు హూతీల పొలిటికల్‌ విభాగం సభ్యుడు మొహమ్మద్‌ అల్‌ బుఖైతీ వెల్లడించారు. సౌదీ మినహా ఇతర దేశాల నౌకల జోలికి వెళ్లబోమని, బాబ్ అల్-మండేబ్ జలసంధిని మూసివేయబోమని స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్‌ను బెదిరిస్తే భీకర దాడులు చేస్తామని ఆ దేశ పార్లమెంట్‌ స్పీకర్‌ ఘాలిబఫ్‌ హెచ్చరించారు.