పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో భారీ ప్రక్షాళన: ఆకిబ్ జావేద్‌పై వేటు?

రిపోర్టర్: రాము స్థలం: World

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వరుస వైఫల్యాల నేపథ్యంలో సెలక్షన్ కమిటీని ప్రక్షాళన చేసేందుకు బోర్డు సిద్ధమైంది. ఇందులో భాగంగా చీఫ్ సెలెక్టర్ ఆకిబ్ జావేద్‌ను ఆ పదవి నుంచి తప్పించి, కేవలం లాహోర్ హై పర్ఫార్మెన్స్ సెంటర్ బాధ్యతలకే పరిమితం చేయాలని ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ ఆటగాళ్లను జట్టు నుంచి పంపేయడం చర్చనీయాంశంగా మారింది.