రంజీ ట్రోఫీ షెడ్యూలింగ్పై సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
భారత క్రికెట్ నియంత్రణ మండలి అనుసరిస్తున్న షెడ్యూలింగ్ విధానం వల్ల దేశీవాళీ రంజీ ట్రోఫీ ప్రతిష్ట దిగజారుతోందని టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. రంజీ మ్యాచ్లు జరుగుతున్న సమయంలోనే ఇండియా-ఏ సిరీస్లు నిర్వహించడం వల్ల కీలక ఆటగాళ్లు తమ రాష్ట్ర జట్లకు దూరమవుతున్నారని ఆయన విమర్శించారు. టోర్నీ నాణ్యతను కాపాడటానికి బీసీసీఐ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సునీల్ గవాస్కర్ డిమాండ్ చేశారు.