యానాం గోదావరిలో మత్స్యకారులకు చిక్కిన భారీ పండుగప్ప చేప

రిపోర్టర్: కృష్ణ స్థలం: యానాం

యానాం గౌతమీ గోదావరి నదిలో మత్స్యకారుల వలకు ఇరవై కేజీల భారీ పండుగప్ప చేప చిక్కింది. స్థానిక రేవులో జరిగిన వేలంపాటలో ఈ చేప పదిహేను వేల రూపాయలకు అమ్ముడుపోయింది. ఎంతో రుచికరమైన ఈ భారీ చేపను కోలంక గ్రామానికి చెందిన కొనుగోలుదారుడు దక్కించుకున్నారు. నదిలో అరుదుగా లభించే ఈ పెద్ద చేపను చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.