ఓట్ల వేటలో దూకుడు పెంచిన కాంగ్రెస్ అభ్యర్థి పరదేశీ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఐరాల

ఐరాల జడ్పీటీసీ కాంగ్రెస్ అభ్యర్థి అగరంపల్లి పరదేశీని భారీ మెజారిటీతో గెలిపించాలని జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ ఓటర్లను కోరారు. మండలంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న పరదేశీకి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కందుకూరి హుమేష్ తో పాటు పలువురు పార్టీ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.