కోర్టు క్లియరెన్స్ రాగానే మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై మంత్రి నారాయణ స్పష్టత

రిపోర్టర్: కృష్ణ స్థలం: నెల్లూరు

ఆంధ్రప్రదేశ్లో కోర్టు క్లియరెన్స్ వచ్చిన వెంటనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పర్యటనలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం కోర్టులో పలు అంశాలపై విచారణ జరుగుతోందని, కొన్నింటిపై తీర్పులు రిజర్వ్లో ఉన్నాయని తెలిపారు. న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయిన వెంటనే ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తామని ఆయన వెల్లడించారు.