ఫ్యూచర్ సిటీలో శాంతిభద్రతల పరిరక్షణ: నూతన పోలీస్ కమిషనరేట్ ప్రారంభించిన సీఎం రేవంత్
రిపోర్టర్: శివ
స్థలం: రంగారెడ్డి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో భద్రతను పటిష్టం చేసేందుకు ఇబ్రహీంపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ కమిషనరేట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భవిష్యత్ పారిశ్రామిక, నివాస అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కమిషనరేట్‌ను తీర్చిదిద్దినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు.