పోలండ్ సరిహద్దులో రష్యా డ్రోన్ దాడి కలకలం

రిపోర్టర్: విజయ్ స్థలం: World

పోలండ్ సరిహద్దు సమీపంలో రష్యా డ్రోన్ దాడి కలకలం సృష్టించింది. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, ఇతర యూరోపియన్ నేతలు ప్రయాణిస్తున్న ప్రత్యేక రైలును అత్యవసరంగా నిలిపివేశారు. కైవ్‌ నుంచి పోలండ్ వెళ్తున్న రైలు మార్గంలో పేలుడు సంభవించడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నాటో సరిహద్దుకు అతి సమీపంలో ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది.