కాళేశ్వరంపై కేసీఆర్ మాట్లాడటం సిగ్గుచేటు: మంత్రి ఉత్తమ్

రిపోర్టర్: నరేష్ స్థలం: Hyderabad

కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ, నేనే ఇంజనీర్ అంటూ కేసీఆర్ కాళేశ్వరం కట్టించి చివరకు కూల్చేశారని మండిపడ్డారు. లక్ష కోట్లు ఖర్చు చేసినా సరిగా నిర్మించకపోవడం వల్లే సమస్యలు వచ్చాయన్నారు. రాష్ట్రంలో నీళ్ల సమస్యకు ఎల్‌నినోతో పాటు కేసీఆరే కారణమని ఆరోపించారు.