సాధారణ మొబైల్ యూజర్ల కోసం నాలుగు రీఛార్జ్ ప్లాన్లు తెచ్చిన జియో

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశాల మేరకు రిలయన్స్ జియో డేటా అవసరం లేని ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం నాలుగు కొత్త వాయిస్ ఓన్లీ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.147 నుంచి రూ.197 ధరలతో ఈ ప్లాన్లు లభిస్తున్నాయి. వీటిలో ప్లాన్ను బట్టి వ్యాలిడిటీ ఉంటుంది. అన్ని ప్లాన్లలో అపరిమిత వాయిస్ కాల్స్, మూడు వందల ఎస్సెమ్మెస్లు మాత్రమే లభిస్తాయి. డేటా లేదా ఓటీటీ ప్రయోజనాలు అస్సలు ఉండవు.