పాడేరు గురుకుల కళాశాలలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాడేరు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని గురుకుల కళాశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ప్రిన్సిపాల్ ధనలక్ష్మి పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పాండు కరాటే అకాడమీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ బాకూరు పాండు రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సుమారు 20 మంది విద్యార్థులు శ్రీకృష్ణుడి వేషధారణలో అలరించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించేలా నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపింది.